

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్15
తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో దర్గా ముందు కాలువ నిండిపోవడంతో మురుగు బయటికి ప్రవహిస్తూ , తీవ్ర దుర్ఘధం వెదజల్లుతోంది . మురుగునీటి కారణంగా దోమ దోమల బెడద ఎక్కువై, ప్రజలు తీవ్ర ఇబ్బందులతో పాటు, డెంగీ, మలేరియా,టైఫాయిడ్ వంటి అనేక రకాల జబ్బుల భారిన పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు కనీసం కన్నెత్తేనా చూడలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై అధికారులకు చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే పారిశుధ్యం లోపించి, గ్రామాలు అద్వానంగా దర్శనమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామాలలోని పారిశుధ్యం పట్ల శ్రద్ధ వహించి, స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మండలంలోని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
