

నిరీక్షణ యాత్రికులు-జూబిలీ వేడుకలు.
జనం న్యూస్ 15 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలోని ప్రఖ్యాత సిలువకొండ పుణ్యక్షేత్రం దగ్గర ఆదివారం రోజు 2025 జూబ్లీ సంవత్సరాని పురస్కరించుకొని సిలువ విజయోత్సవ సంబరాలు పరిగి విచారణ గురువులు, ఫాదర్ పాల్సన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శృతి ఆరాధన, పరిశుద్ధ జపమాల, అగ్ర పీఠాధిపతులకు స్వాగత సుమాంజలు, 10:30 నిమిషాలకు జూబిలీ సిలువ ప్రదక్షణ చేశారు. అనంతరం 11:00 గంటలకు దివ్య పూజ నిర్వహించారు. తరువాత దివ్యబలి పూజ కార్యక్రమం, రోగుల కొరకు, ఇతర ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వారందరికీ స్వస్థత ప్రార్ధనలు, పరిగి విచారణ గురువులు ఫాదర్ పాల్సన్,అగ్ర పీఠాధిపతులు, ఇతర గురువులచే ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిధిలోని భక్తులే కాకుండా ఇతర జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గట్టుపల్లి సిలువకొండ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
