Listen to this article

జనం న్యూస్ 15 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి

జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్. కొనసాగించాలి.సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకటస్వామి వివి నరసింహ ఈరోజు ఉండవెల్లి మండల కేంద్రంలో తెలంగాణ బిల్డింగ్ అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఉండవెల్లి మండల మూడవ మహాసభ అబ్దుల్ ఖదీర్ అధ్యక్షతన ఉండవల్లి మండల కేంద్రంలో జరిగినది.ఈ మహాసభను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకటస్వామి వివి నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం సిఐటియు అని అలాగే కేంద్రంలో ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా 1996లో వెల్ఫేర్ బోర్డు చట్టం తీసుకురావడం జరిగిందని ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పోరాటం ద్వారా 2009లో అమలు చేసుకోవడం జరిగిందని కార్మికులు ఐక్యంగా పోరాడి సాధించుకున్న చట్టాన్ని ఈరోజు కేంద్ర బిజెపి ప్రభుత్వం లేబర్ కోడుల పేరుతో చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా సవరణలు చేసిందని చట్టాన్ని యధావిధిగా కొనసాగించే విధంగా కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు గడువు ముగిసిందని రెన్యువల్ చేయడం లేదని తక్షణమే కార్డు ఉన్న ప్రతి కార్మికుడికి యధావిధిగా కొనసాగి విధంగా రెన్యువల్ చేయాలని పరిహారం కొరకు దరఖాస్తు చేసుకున్న కార్మికుడికి తక్షణమే పరిహారం చెల్లించే విధంగా బోర్డు పోనుకోవాలని అలాగే ప్రమాద మరణం సాధారణ మరణం సంబంధించిన పరిహారము ఆరు లక్షల నుండి 10 లక్షల పెంచారని లక్ష 30000 నుండి రెండు లక్షల పెంచారని దీనితోపాటు ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందిన కార్మికులకు సంబంధించిన ఇవ్వాల్సిన డబ్బులు కూడా బోర్డు ద్వారా ఇవ్వకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే విధంగా జీవో ఇచ్చిందని దీని తక్షమే ప్రభుత్వము వెనక్కి తీసుకొని యధావిధిగా సంక్షేమ బోర్డు నుండే పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే కార్మికులకు బోటు ద్వారా ఇండ్లు నిర్మించి ఇచ్చి అలాగే పనిముట్లు వాహనాలు సబ్సిడీ ద్వారా బోర్డు నుండి ఇవ్వాలని 60 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి 5000 రూపాయలు పెన్షన్ ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని మాట్లాడడం జరిగింది అలాగే జిల్లాలో 20000 వేల మంది కార్మికులు కార్డులు రెన్యువల్ చేసుకోలేదని ప్రభుత్వం వాటిని ఎదవిధిగా రెన్యువల్ చేసే విధంగా ఈ కార్యక్రమంలో సర్కులర్ జారీ చేయాలని అర్హులు కాకుండా అనర్హులకు బోర్డు డబ్బులు పరిహార రూపకంగా ఇస్తున్నారని దీనిపై దళారి వ్యవస్థ పెత్తనం ఎక్కువైందని దీనిని నిరోధించే విధంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి M.వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జీకే ఈదన్న వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు ప్రగటూరు మద్దిలేటి లాయర్ల సంఘం జిల్లా నాయకులు లక్ష్మన్న మధు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాఘవేంద్ర ప్రజానాట్యమండలం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆలీ అక్బర్ ఆశన్న మధు కృష్ణ గోపి మై ముద్దిన్ బాలరాజు నరసింహ లోకేష్ వెంకటేశ్వర్లు కే బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదాలతో మషపోగు వెంకటేశ్వర్లు ఉండవెల్లి మండల కార్యదర్శి జోగులాంబ గద్వాల జిల్లా