Listen to this article

జనం న్యూస్ 15 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా పరిధిలో ఓ ప్రైవేటు ఫామ్ హౌస్ లో 1992- 93 కీసరగుట్ట రెసిడెన్షియల్ పాఠశాలలో ఆ సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కలుసుకోవాలని ప్రతిపాదన ఏర్పాటు చేసుకొని 2015 నుండి ప్రతి మూడు సంవత్సరాలకు ఎక్కడో ఒకచోట కలుసుకొని వారి యొక్క బాగోగులు మరియు పిల్లల చదువులు, ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆదుకోవడం తెలుసుకోవడం జరుగుతుంది. 2015లోపరిగి ,తర్వాత 2018 కీసరగుట్ట, 2021 మేడ్చల్ లో ఇప్పుడు పరిగిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పదవ తరగతి పూర్తయి సుమారు 33 సంవత్సరాల తర్వాత కూడా వారి యొక్క స్నేహాన్ని కొనసాగించడం చాలా ఆనందదాయకమని స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. పరిగిలో కలుసుకోవడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం లో చిన్నతనంలో వారు కష్టపడిన తీరు, ఉపాధ్యాయులు వారికి బోధించిన అంశాలను మరియు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కష్టపడి చదివి,ఈరోజు ఒక్కొక్కరు ఉన్నత స్థానాల్లో ఎదిగే టందుకు ఆ ఉపాధ్యాయులే కారణమని సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇంతకు మునుపు కీసరగుట్టకు సంబంధించి మౌలిక సదుపాయాలు గాని ఎవరైనా స్నేహితులు ఆపదలో ఉంటే వారిని ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలాగే వారి యొక్క స్నేహాన్ని కొనసాగిస్తూ అన్ని సామాజిక ఆర్థిక అంశాల పట్ల ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సామూహికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్నాపూర్ శ్రీనివాస్, ముక్కు శశిధర్ ,ఆనంద్ గౌడ్, క్రాంతి ,శివ , రాజిరెడ్డి, శ్రీధర్, పి శ్రీనివాస్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి పూర్ణచంద్ర, సత్యపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి , రాములు, ఏం రాజశేఖర్, కే రమేష్ కుమార్, జి శ్రీధర్, సత్యనారాయణ, సాయన్న,, కాశీ విశ్వనాథ్ రెడ్డి, గోవిందు, పెంటయ్య, అనిల్ కుమార్, రవి వీరాశేఖర్, డల్లస్ శీను మిత్రులందరికీ పాల్గొనడం జరిగింది.