Listen to this article

జనం న్యూస్**ఎన్టీఆర్ జిల్లా* *ఇబ్రహీంపట్నం మండలం**సెప్టెంబర్ 17**స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అన్నారు.కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కొత్త గేట్, ఖిల్లా రోడ్ ప్రభుత్వ హాస్పిటల్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ చిట్టిబాబు మాట్లాడుతూ స్త్రీలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో ‘స్వస్థ్‌ నారీ, సశక్త్‌ పరివార్‌’ అభియాన్‌ కార్యక్రమాన్ని కేంద్రం రూపొందించిందని,ఈ కార్యక్రమం నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించారని తెలిపారు.ఈ కార్యక్రమం వచ్చేనెల 2వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు.ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు అన్ని చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మహిళలకు అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు.మారిన జీవనశైలి, వాతావరణంలో మార్పుల కారణంగా మహిళలు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా బీపీ, షుగర్, క్యాన్సర్‌,చర్మ వ్యాధులు, రక్తహీనత లాంటి అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో, పట్టణాల్లో వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ అయితే వెంటనే తగిన చికిత్స, మందులు అందించడం కోసం ‘స్వస్థ్‌ నారీ, సశక్త్‌ పరివార్‌’ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని తెలిపారు.ప్రతి ఇంట్లో స్త్రీలు ఆరోగ్యం ఉంటే ఆ ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు అఫ్సర్, జనార్ధన్ స్వామి దాసు ,డాక్టర్ బి విజయ్ కుమార్, డాక్టర్ ఎం వంశీ లాల్ రాథోడ్, సాంబశివరావు,రత్న కుమారి, ఏఎన్ఎమ్ లు, ఆశా వర్కర్స్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.