Listen to this article

జనం న్యూస్ 19సెప్టెంబర్ పెగడపల్లి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తంలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుండి శాస్త్రవేత్తలు సుమలత మరియు రామకృష్ణ ఐతుపల్లిలోని వరి నీ సందర్శించడం జరిగింది. వరిలో తీసుకోవాల్సిన పలు సస్యరక్షణ చర్యల గురించి సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఏఈఓ పవన్, సరోజినీ మరియు రైతు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.