Listen to this article

పోలీస్ కమిషనర్ వెల్లడి..

జనంన్యూస్. 19.నిజామాబాదు. ప్రతినిధి.

దసర పండుగ సెలవులకు వెళ్లే వారు ఈ దిగువ తెలియజేసిన నిబంధనలు తూ.చ తప్పక ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు పూల మొక్కలు, హర్ ఏక్ మాల్ వస్తువు లను విక్రయించే వారి పై ” నిఘా” పెట్టండిరాత్రయితే అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించండి శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెత కటం, రాత్రి వేళ చోరీలకు పాల్పడటం జరుగుతుంది. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని ఇంటి కి వచ్చేలా ప్రణాళిక వేసుకొండి పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది ఇంట్లొ కుటుంబ సభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్ధులు “అపరిచితులు” సమా చారం పేరుతో వస్తే నమ్మకుండా ఉండాలనీ చెప్పండి విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చినమ్మి వెళ్లకూడదు. ఊరు వెళ్లేటప్పుడు ఖరీ దైన వస్తువులు ఇంటి లో ఉంచ కపోవడమే మంచిది (లేదా) బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిది కాలనీల వారిగా ” గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించండి పోలీస్ శాఖ వారికి అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి ప్రత్యేకంగా మీ చుట్టు ప్రక్కల వారి ల్యాండ్ ఫోన్ నెంబరు (లేదా) సెల్ ఫోన్ నెంబర్లు మీదగ్గర ఉంచుకోగలరు మీరు బయటకు వెళ్తున్న
సంగతి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. ప్రయాణం పూర్తయ్యక , ఇంటికి వచ్చిన తరువాత మాత్రమే ఫోటోలు, సమాచారం షేర్ చేసుకోండి విధ్యుత్, గ్యాస్ లైన్, ఫ్రిజ్ మొ॥ వాటిని సరిగ్గా ఆఫ్ చేయండి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి. లేదా డయల్ 100 ను సద్వినియోగం చేసుకోండి