Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఒక సంవత్సరం కాలమైన సందర్భంగా ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు సందర్శించి అన్నార్తులకు భోజనం వడ్డించి యోగ సమాచారాన్ని భోజన వసతులను అడిగిన వెంటనే భోజనం రుచికరంగా సూచి శుభ్రత పాటిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ భోజనానికి చేయడానికి వచ్చిన వారిని ఉద్దేశించి నాగ జగదీష్ మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో ఏడాది కాలంలో లక్షలాదిమంది పేదలు ఆకలి తీర్చారని, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు కుడు, గుడ్డ,నీడ ప్రతి ఒక్కరికి అందించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకున్న గత ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి పాలనలో అన్నా క్యాంటీన్లో రద్దుచేసి పేదలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి నేడు పేదల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుందని, ఇటువంటి నీచ మనస్తత్వం ఉన్న జగన్ రెడ్డి మాటలు, అభద్ద ప్రచారాలను తిప్పు కొట్టాలి నాగ జగదీష్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కోట్ని రామకృష్ణ బోడి వెంకటరావు కాండ్రేగుల సత్యనారాయణ మల్ల గణేష్ కర్రి మల్లేశ్వరరావు మల్లా శివన్నారాయణ శ్రీకాకుళం గణపతి బర్నికాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.//