Listen to this article

జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామం
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పై చేసిన వాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని భాజాప్తు గద్దరన్నకు క్షమాపణ చెప్పాలని బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్)ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్ ఎ బి ఎస్ ఫ్,ఎ వై సి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మొగ్గం సుమన్ మాట్లాడుతూ గద్దరన్న ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలైన బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేశారని అన్నారు. గద్దరన్న తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేశారని, తన సొంత లాభం కోసం తన కుటుంబం కోసం ఎప్పుడు జీవించలేదని తెలిపారు. గద్దర్ అంటేనే ప్రతి పేదవాడి గుండె చప్పుడు అని, సమాజంలో అణచివేతకు గురైన వారి గుండెలో చిరస్థాయిగా నిలుస్తాడని ఈ సందర్భంగా అన్నారు. బండి సంజయ్ బిజెపి ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలు చేసుకుంటూ ప్రజలలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలన చేయడం సిగ్గుచేటు అని బిజెపి ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు. గద్దరన్నకు ఇలాంటి అవార్డులు,రివార్డులు తన కాలుగోటికి సరిపోవు అని తెలిపారు. బండి సంజయ్ గద్దరన్న ను విమర్శించే స్థాయి నీకు లేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గద్దరన్న చేసిన త్యాగం గురించి నువ్వు తెలుసుకోవాలి అన్నారు. నిస్వార్ధంగా బ్రతుకుతూ సమ సమాజ స్థాపన కోసం గద్దరన్న ఎంతో కృషి చేశాడని అన్నారు. బండి సంజయ్ భాజాప్త్ గద్దరన్నకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేనియెడల సమాజంలో ఉన్న మెజారిటీ ప్రజలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఏకం చేసుకొని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య (ఏ బి ఎస్ ఎఫ్) హనుమకొండ జిల్లా నాయకులు నాలికే ప్రతాప్, బహుజన నాయకులు
బోల్లెపేల్లి ప్రసాద్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొంగర విజయ ప్రకాష్, కార్యదర్శి నాలిక శ్రీకాంత్, నరేష్,బి ఎస్ ఎస్ నాయకులు మొగ్గం రాజు, తదితరులు పాల్గొన్నారు….