Listen to this article

జనం న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 19 )

అశ్వారావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండలం రేపల్లె వాడ గ్రామంలో బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు స్వంత ఖర్చులతో గ్రామంలోని చెడిపోయిన చేతి పంపును మరమ్మతు చేసి, గ్రామస్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు తక్షణమే స్పందించి, తన సొంత వ్యయంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన ఆయనను గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ – “సమస్య వచ్చిన వెంటనే ముందుకు వచ్చి పరిష్కారం చూపిన సత్తి నాగేశ్వరరావు గారు నిజమైన ప్రజానేత” అని హర్షం వ్యక్తం చేశారు.