Listen to this article

జనం న్యూస్, తేదీ. 20-9-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ

పాల్వంచ పట్టణ మండల ప్రాంతాల్లో పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్న వనమా

ఈరోజు పాత పాల్వంచ లోని BRS పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరరావు గారిని వారి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్ మూర్తి మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం వారితో మాట్లాడుతూ పాల్వంచ పట్టణ మరియు మండల లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు అదేవిధంగా సమస్యలను అడిగి తెలుసుకున్న వనమా వెంకటేశ్వరరావు గారు BRS పార్టీ తరపున ప్రజలకు అండగా ఉండాలని ప్రజల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం శ్రీరామ్ మూర్తి మరియు నాగేశ్వరరావు మాట్లాడుతూ వనమా గారితో ప్రజా సమస్యలను వనమా గారి దృష్టికి తీసుకెళ్లామని వారు కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని వారి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారని ప్రస్తుతం వనమా గారి ఆరోగ్యం బాలేదని వస్తున్న వార్తలు నిజం కాదని అవన్నీ పవాస్తవాలని వనమా గారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు