

జనం న్యూస్.సెప్టెంబర్ 19. మెదక్ జిల్లా.నర్సాపూర్.
నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బి.వి.ఆర్ ఐటి కళాశాలలో ఇమాజిన్ జపాన్ పెయింటింగ్ పోటీలు విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే తెలిపారు. గ్రాడ్యుయేట్ స్టడీ అబ్రాడ్ సెంటర్ జిఎస్ఎసి.జపనీస్ భాషా విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 67 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈపోటీలో పాల్గొని జపాన్ సంస్కృతి సంప్రదాయాలు ఆవిష్కరణలను తమ కళాత్మక సృజనాత్మకతతో కాన్వాస్‌పై త్రీకరించారన్నారు.
ఈ కార్యక్రమానికి సాగా యూనివర్సిటీ,జపాన్ ప్రొఫెసర్ డా.యుకియో నాగనో కురుమే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జపాన్ ప్రత్యేక ప్రొఫెసర్ డా. షుచి టోరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వారిసమక్షంలొ విద్యార్థులకు అధ్యాపకులకు జపాన్ విద్యాసంబంధ అంశాలు, సంస్కృతిపై మరింత లోతైన అవగాహన కల్పించబడిందని అన్నారు.ఇమాజిన్ జపాన్ పెయింటింగ్ పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులలో జపాన్ లోని ఉన్నత విద్య సంసృతి సంప్రదాయాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఇందులో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు జపాన్ జీవితంలోని వివిధ అంశాలైన అందమైన ప్రదేశాలు సాంస్కృతిక కట్టడాలు సంప్రదాయాలు ఆధునికతను చిత్రీకరించి చూపించారని అన్నారు.ఈపోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేసి,వారికళానైపుణ్యాన్ని గుర్తించారు. ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి విద్య అవకాశాలు సంసృతి సంప్రదాయాలను తెలుసుకునే విధంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదుకు తమ కళాశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.విశాల దృష్టి కల మావిష్ణు విద్య సంస్థల చైర్మన్ కేవి విష్ణు రాజు ఉన్నత మైన ఆలోచనలకు ఈకార్యక్రమం ఒక ఉదాహరణ అని చెప్పారు.ఇమాజిన్ జపాన్ పెయింటింగ్ పోటీకి వచ్చిన స్పందన పట్ల విద్యార్థులకు అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు విద్య సంస్థల డా.రాజు ఏడ్ల.జీఎస్ఏసీ శ్రీమతి కె.ప్రణీత జపనీస్ భాషా ఉపాధ్యాయురాలు లవీనా అరోర.కళాశాల మేనేజర్ బాపిరాజు.సురేష్.మల్లికార్జున్. వివిధ విభాగాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
