

(జనం న్యూస్ సెప్టెంబర్ 19 చంటి)
రాయపొల్ మండల కేంద్రంలో శుక్రవారం “వికలాంగుల హక్కుల పోరాట సమితి” కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా మసాన్ పల్లి ప్రభాకర్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అయ్యగల్ల రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి, వరుసగా 20 నెలలు గడుస్తున్నా అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం మసాన్ పల్లి ప్రభాకర్ మాట్లాడుతూ అధ్యక్షుడిగా నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వంతు కృషితో వికలాంగుల హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం లబ్దిదారుల పక్షాన పనిచేస్తాను అని అన్నారు. ఉపాధ్యక్షుడు కుమ్మరి యాదగిరి వడ్డేపల్లి, గల్వా సంతోష్ రెడ్డి.ప్రధాన కార్యదర్శి సొక్కం నర్సింలు, కార్యదర్శి ఆరేపల్లి నాగరాజు, కోశాధికారి గట్టు బిక్షపతి, అధికార ప్రతినిధిగా పటాన్ అలీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు అరికెల సత్తయ్య, సలహాదారులు కుమ్మరి స్వామి, ఇప్ప నారాయణ, సభ్యులు తుప్పతి మల్లేశం,పొట్టోళ్ళ మల్లేశం, రామొల్ల బిక్షపతి, స్వామి, అరిగే యాదయ్య, ఇప్ప రాములు తదితరులు పాల్గొన్నారు.