

జనం న్యూస్. సెప్టెంబర్ 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
హత్నూర మండలంలోని నాగుల్ దేవులపల్లి గ్రామంలో ధన్ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించినట్లు మండల పశు వైద్య అధికారి డాక్టర్ సంధ్యారాణి.హేమలతలు తెలిపారు.ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ 41పశువులకు గర్భకోశ చికిత్సలు4 చూడిపరీక్షలు.16కృతిమ గర్భ ధారణ చికిత్సలు32 దూడలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగిందని అదేవిధంగా 26 పశువులకు సాధారణ చికిత్సలు చేసినట్లు ఆమె తెలిపారు.ఈకార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది దన్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
