

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట: మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని 18వ, 25వ వార్డులలో సుమారు రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ ఛైర్మన్ షేక్ రఫాని, మార్కెటింగ్ యార్డ్ ఛైర్మన్ షేక్ కరీముల్లా, టౌన్ ప్రెసిడెంట్ సమద్ ఖాన్, టౌన్ సెక్రటరీ రవి, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ కందుల రమణ, 18వ వార్డు ప్రెసిడెంట్ ఏ. కోటేశ్వరరావు, టౌన్ అధికార ప్రతినిధి ఎం. మల్లిబాబు, వార్డు కౌన్సిలర్ సురేష్, వార్డు ప్రెసిడెంట్ పూర్ణ సింగ్, అనిత భాయ్, యూనిట్ ఇన్‌ఛార్జ్ మాధవ్, ఐటీడీపీ బాలాజీ సింగ్ మరియు ఇతర వార్డు ఇన్‌ఛార్జులు, సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని నేతలు పేర్కొన్నారు.