Listen to this article

కె ఆర్ ఎం బి చైర్మన్ కు వినతి పత్రం సమర్పించిన మాజీ కౌన్సిలర్ రమేష్ జి

జనం న్యూస్ – సెప్టెంబర్ 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అప్పజెప్పాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ బిపి పాండే కు వినతి పత్రం అందించిన నందికొండ మున్సిపాలిటీ మాజీ బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాజీ కౌన్సిలర్ హీరేకార్ రమేష్ జి . నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చిన కె ఆర్ ఎం బి చైర్మన్ బి పి పాండే, కె ఆర్ ఎం బి సభ్యులు కేకే జాన్గిడ్ లకు శుక్రవారం విజయ విహార్ వసతి గృహంలో కలిసి వినతి పత్రం అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఎస్ పి ఎఫ్ బలగాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పటిష్టమైన భద్రతను కల్పించారని సుమారు ఒక సంవత్సరం నుండి కేంద్ర సాయుధ బలగాలు భద్రత కల్పించుట పై చైర్మన్ ను కలిసి తక్షణమే విశాఖపట్నం కు చెందిన సిఆర్ పిఎఫ్ బలగాలను నాగార్జునసాగర్ డ్యాం భద్రత నుంచి ఉపసంహరించాలని, తెలంగాణ ఎస్ పి ఎఫ్ బలగాలకు డ్యాం భద్రత అప్పజెప్పాలని కోరారు. ఈ సందర్భంగా రమేష్ జి చైర్మన్ పాండే కాళ్ళు మొక్కి ప్రాధేయపడ్డారు. దీనిపై కె ఆర్ ఎం బి చైర్మన్ సానుకూలంగా స్పందించి పూర్తి విచారణ చేసి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కే ఆర్ ఎం బి సభ్యులు కేకే జాన్గిడ్, కె ఆర్ ఎం బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు సాగర్ డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీతారాం, ఏ ఈ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.