Listen to this article

తెలంగాణ – హర్యానా సంస్కృతుల సందడి, విద్యార్థుల ప్రతిభ ఆకట్టుకుంది

జనం న్యూస్ సెప్టెంబర్ 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం రోజునా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన “ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్” కార్యక్రమం సంస్కృతుల సమ్మేళనం అద్భుతంగా సాగింది.ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు మాట్లాడుతూ, “భారతదేశం భాషలు, మతాలు, ఆచారాలు, పండుగలలో విభిన్నత కలిగి ఉన్నప్పటికీ, మన దేశం ఏకత్వానికి ప్రతీక. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో జాతీయ ఏకత్వాన్ని పెంపొందిస్తుంది” అన్నారు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ, “భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత. అదే ఆత్మతో విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారు” అన్నారు.చార్ట్ ఎగ్జిబిషన్లో తెలంగాణ–హర్యానా సంస్కృతి ప్రతిబింబించగా సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు తయారు చేసిన వంటకాలు అందరిని రుచి చూపించాయి.పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగరాణి, ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, సమత, విజయ్, ఎస్. శ్రీనివాస్, రాజనర్సయ్య, గంగాధర్, ప్రవీణ్ శర్మ, కె. శ్రీనివాస్, గంగా మోహన్, నరేష్, ట్వింకిల్, కోమలి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.