Listen to this article

జనం న్యూస్.సెప్టెంబర్ 19. మెదక్ జిల్లా.నర్సాపూర్.

నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బి విఆర్ఐటి కళాశాలలో సెప్టెంబర్ 18,19 తేదీల్లో ఘనంగా నిర్వహించిన స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్-2025 విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే తెలిపారు. డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మీ ప్రసాద్ కళాశాల మేనేజర్ బాపిరాజు, వివిధ విభాగాల అధ్యాపకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.హ్యాకథాన్‌లొ మొత్తం362 జట్లు62 హార్డ్‌వేర్, 300 సాఫ్ట్‌వేర్ జట్లు తమ వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించాయి.హార్డ్‌వేర్ విభాగం భౌతికరూపంలో ఆఫ్‌లైన్ 18వ తేదీన,సాఫ్ట్‌వేర్ విభాగం ఆన్‌లైన్‌లో 19వ తేదీన నిర్వహించబడిందని తెలిపారు. విద్యార్థులు స్మార్ట్ ఆటోమేషన్ గ్రీన్ టెక్నాలజీ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ ఆరోగ్యరంగ టెక్నాలజీ విపత్తు నిర్వహణ వంటి విభిన్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అందించారు సివిల్ ఈఈఈ మెకానికల్ ఈసీఈ పీహెచ్‌ఈ బిఎమ్‌ఈ కెమికల్ సిఎస్‌ఈ ఐటీ ఏఐడీఎస్ విభాగాల అధ్యాపకులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించి అన్ని జట్ల ప్రదర్శనలను నిష్పాక్షికంగా పరిశీలించారు.మొత్తం362 జట్లలో 50 ఉత్తమ జట్లు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయని అన్నారు.ఎంపికైన జట్లకు జాతీయ స్థాయి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2025 లో పాల్గొనే అవకాశం లభించనున్నదని తెలిపారు. హ్యాకథాన్ విద్యార్థుల్లో సాంకేతిక సృజనాత్మకత సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా దేశానికి అవసరమైన వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించే దిశగా ప్రోత్సహించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజర్ శ్రీ బాపిరాజు టిఎల్ఎన్.సురేష్.కాంతారావు. డాక్టర్ మల్లికార్జున్.వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు