జుక్కల్ సెప్టెంబర్ 20 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం లో శుక్రవారం అర్ధరాత్రి ఒకటి 30 నిమిషాలకు సబ్ కలెక్టర్ బాన్సువాడ వారి ఆదేశాల మేరకు పోతంగల్ మంజీరా ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లోడుతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ లింబూర్ గ్రామం వద్ద రెవిన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా పట్టుకోవడం జరిగింది. అట్టి ట్రాక్టర్ యొక్క యజమాని అయినా షేక్ ఇలియాస్ సిర్పూర్ గ్రామస్థుడు మరియు ట్రాక్టర్ డ్రైవర్ వద్ద ఎలాంటి అనుమతి పత్రాలను లేనందున నమ్మదగిన సమాచారం మేరకు ఒక ట్రాక్టర్ ను మద్నూర్ పోలీస్ స్టేషన్ నందు సేఫ్ కస్టర్డ్ కొరకు ఉంచడం జరిగింది. తదుపరి చర్య కొరకు ఉంచడం జరిగింది.


