Listen to this article

జనం న్యూస్,సెప్టెంబర్ 20,అచ్యుతాపురం:

పని గంటల విధానంలో ప్రభుత్వం ఎనిమిది గంటల నుండి 13 గంటలు పెంచుతూ రాత్రి సమయంలో మహిళలతో పని చేయించేందుకు నిన్న క్యాబినెట్లో కార్మిక చట్టాలను సవరించడం జరిగిందని, పనిగంటల పెంపు పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కే సోమనాయుడు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికుల సంక్షేమమే మా ధ్యేయమని చెప్పి అధికారంలోకి వచ్చి నేడు స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెట్టుబడుదారులకు కార్మికుల శ్రమను దోచుకునేందుకు మరింత అనుకూలంగా కార్మిక చట్టాలను మారుస్తుందని, ఫ్యాక్టరీలు చట్టం 1948 సవరణ చేసి సభ ఆమోదం తెలిపిందని, కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం చట్టాలను నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలోకి తొక్కి కార్మికులను మరింత దోపిడీ చేసే విధంగా చట్టాలను సవరించడం దుర్మార్గమని, వెంటనే 13గంటల పని విధానం పెంపు, మహిళలకు రాత్రి డ్యూటీలు రద్దు చేయాలని లేదంటే కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి ప్రజా పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కర్రి నాయుడు,నాగేశ్వరరావు, పార్వతీ,నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.