జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర గ్రీన్ డే సందర్భంగా నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని నారాయణరాజు పేట ఎర్ర చెరువు కట్ట రహదారి పరిసరాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు ఒక్కొక్కరు ఒక మొక్క నాటడం ద్వారా మానవాళికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్య క్రమంలో గ్రామ పంచాయతీ ఈవో సురేష్ సిబ్బంది సుధీర్ .శివ,గ్రామస్తులు మట్టి బాబు తుమ్మాది శివకుమార్. ఉపాధి హామీ పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు.


