జనం న్యూస్,సెప్టెంబర్ 20,అచ్యుతాపురం:
మండలం లోని మడుతూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడో శనివారం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నేడు దీనిలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మోటూరు శ్రీ వేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించి వీలైనంతగా దుకాణాల నుండి తీసుకెళ్లే వస్తువులకు గుడ్డ సంచులు వాడాలని,అదే మాదిరిగా తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని కోరారు. గ్రామస్తులంతా పరిశుభ్రత పాటించడంతో గ్రామం అంతా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ బి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయిని ,సచివాలయ సిబ్బంది,కూటమి నాయకులు నీరుకొండ సంతోష్ ,బలిరెడ్డి శ్రీను, శనివాడ చిన్ని, వెంకటరమణ,వెల్లం శెట్టి శశి, శనివాడ ప్రేమ్ కుమార్,చుక్క అరుణ్ కాంత్ అంగనవాడి కార్యకర్త మోటూరు కుమారి తదితరులు పాల్గొన్నారు.


