20 రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు.
ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలో కల్వర్టు.
జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలొని వెంకటపూర్ మరియు బల్హన్పూర్ గ్రామాల మధ్యలో నిర్మించి ఉన్న బ్రిడ్జి కోతకు గురై చాలా ప్రమాదకరంగా మారింది. ఈరోజు ఈ గ్రామాలను తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, జిల్లా నాయకులు ముచ్చినేని పోషయ్య సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బ్రిడ్జి కోతకు గురై 20 రోజులైనా ఉన్నతఅధికారులు ఎవరు దీనినీ సందర్శించలేదని, గ్రామపంచాయతీ కార్యదర్శి చూసినప్పటికీ పై అధికారులకు సమాచారం ఇచ్చారో లేదో తెలియదని గ్రామస్తులు తెలిపారని, ఇంకా పూర్తిగా కోతకు గురైయితే వెంకటాపూర్ తర్వాత ఉన్నటువంటి బలహన్పూర్ , పార్వతిగూడ, నాయకపుగూడ, సమతలగుండం నాలుగు గ్రామాలకు రాకపోకలు ఆగిపోతాయని, కావున అధికారులు స్పందించి పెద్ద నష్టం జరగకముందే మరమ్మతులు చేపించాలని డిమాండ్ చేశారు


