Listen to this article

2 సంవత్సరాలు గడుస్తున్న అమలు కానీ పెన్షన్.

జూలూరుపాడు, జనం న్యూస్,సెప్టెంబర్ 20: రాష్ట్రంలో నూతన ఫెన్షన్ అమలు చేయాలని
పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జూలూరుపాడు మండల అధ్యక్షుడు దిబ్బెందల సాయి అధ్యక్షతన వి హెచ్ పి ఎస్, ఎం ఆర్ పి ఎస్ జిల్లా ఇంచార్జి ములకలపల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో మండలంలోని వినోభనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు కార్యదర్శి కి నూతన ఫెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వినతి పత్రాన్ని అందచేశారు.ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డబుల్ ఫెన్షన్ ను వికలాంగులకు, వృద్దులకు,వితంతువులకు మరియు వివిధ రకాల ఫెన్షన్ లబ్ధిదారులకు అందిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చారు, రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన హామీని నిలబెట్టికొలేదు,తక్షణమే రెట్టింపు ఫెన్షన్ ను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు చంగల గురునాధం మాదిగ, విహెచ్ పి ఎస్ మండల నాయకులు బి.బాలు నాయక్,సీనియర్ నాయకులు గార్ల పాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.