జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలో వీధి దీపాలు వెలుగక గ్రామప్రజలు రాత్రిపూట బయటికి వెళ్లాలంటే టార్చ్ లైట్ లు పట్టుకొని వెళ్లవలసి వస్తుందని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి పురుషోత్తం ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాంపూర్ గ్రామంలో రెండు మూడు రోజులు గడుసున్నప్పటికీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కి విన్నవించినప్పటికీ కార్యదర్శి విద్యుత్ శాఖ అధికారులు స్పందించడం లేదని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.విద్యుత్ శాఖ అధికారులు రాంపూర్ గ్రామ సమస్యను పరిష్కరించాలని గ్రామం ప్రజలు నాయకులు కోరుకుంటున్నాను


