Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా పోషణ మాసం సందర్భంగా, చిలిపి చెడు మండల సమైక్య మీటింగ్ కి హాజరు కావడం జరిగింది. ఆకుకూరల స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సంఘం అధ్యక్షులకు ఎనీమియా చాలెంజ్ గురించి వివరించడం జరిగింది. ఎవరు కూడా రక్తహీనతతో బాధపడకూడదని, తమ గ్రూపు సభ్యులందరికీ కూడా ఎనీ మియా చాలెంజ్ గురించి వివరించాలని చెప్పడం జరిగింది. చివరగా అందరితో పోషణ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ పి ఎం గౌరీ శంకర్ సీసీలు (వెంకటలక్ష్మి, పురుషోత్తం, శ్రీకాంత్, లక్ష్మణ్, విజయలక్ష్మి) గ్రామ సంఘం అధ్యక్షులు అంగన్వాడి టీచర్స్(ప్రశాంతి) అంగన్వాడి హెల్పర్(శ్వేత) ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సంతోషిమాత పాల్గొనడం జరిగింది.