Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 23

మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి. తర్లుపాడు మండలమునకు 30 శాతం రాయితీతో 60 క్వింటాళ్ళు టీబీజీ 104 రకం పాలిష్ మినుములు అలాట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. మండలంలోని రైతు సేవా కేంద్రాలకు మండల వ్యవసాయ అధికారి అలాట్మెంట్లు జరిపినట్లు తెలిపారు. 4కేజీల పూర్తి ఖరీదు :రూ 552
సబ్సిడీ 164 రూపాయలు రైతు వాటా : 386.40 రూపాయలు ఇది ఖరీఫ్ అలాట్మెంట్ కాబట్టి అవసరమైన రైతులు ఈ నెలాఖరులోపు సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, మరియు సెల్ ఫోన్ తీసుకొని రైతు సేవ కేంద్రం సిబ్బందిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసి నగదు చెల్లించిన రెండు రోజులకు విత్తనాలు అందజేయబడతాయి. రబి సీజనకు కావలసినటువంటి విత్తనాలు మరల అక్టోబర్ 1 నుండి అందజేస్తామని తెలియజేశారు. విత్తన శుద్ధికి అవసరమైన ట్రైకోడెర్మా విరిడి మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నందు కేజీ 50 రూపాయలకు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతుల అవసరాల మేరకు కావలసిన మినుము విత్తనాలను సకాలంలో అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పొలాలు పదునైనందున మినుముపంటను సాగు చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించారు.