Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, బస్టాండ్ ఆవరణలో ఉన్న క్యాంటీన్, ఇతర దుకాణాలను కమిషనర్ తనిఖీ చేశారు.ముందుగా, బస్టాండ్‌లోని క్యాంటీన్‌ను పరిశీలించిన కమిషనర్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని క్యాంటీన్ నిర్వాహకులకు సూచించారు. అనంతరం, బస్టాండ్ వెలుపల ఉన్న కాంప్లెక్స్‌లోని టిఫిన్ షాపులను తనిఖీ చేశారు. కొన్ని దుకాణాల్లో ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కమిషనర్, సంబంధిత దుకాణదారులపై పెనాల్టీ విధించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు ‘స్వచ్ఛతా హి సేవ’లో భాగంగా బస్టాండ్‌తో పాటు, పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. వీరితోపాటు ఆర్టీసీ డిఎం, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు రమణారావు, సునీత, సచివాలయ ఉద్యోగస్తులు, మేస్త్రిలు, వర్కర్లు తదితరులు ఉన్నారు.