Listen to this article

జనం న్యూస్ 23 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

చోద్యం చూస్తున్న ఎండో మెంట్ శాఖ ఇరు పార్టీల రాజకీయ నేతల కుట్రలు.ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పేరుపై దత్త పుత్రుడు గా చూపుతూ ఇనామీ భూమి రిజిస్ట్రేషన్.కబ్జాదారుల నుండి భూమిని కాపాడాలని గ్రామస్తుల ఆందోళన.ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో రాజకీయ నాయకులు అండదండలతో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ఇనామి భూమి ఆక్రమణకు గురైందని వెంటనే కబ్జాకు గురైన భూమిని కాపాడాలని గ్రామస్తులు ఆందోళన చేశారు.నీలహళ్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ భూమి సర్వే నంబర్ 335 పైకి లో గల 5 ఎకరాల 16 గుంటల ఇనామి భూమిని1963 నుండి దేవాలయం భూమిగా కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం రాజకీయ నాయకులు అండదండలతో అట్టి భూమిని కాజెయడానికి కుట్ర చేస్తున్నారని కబ్జా కోరులు దీనిపై కన్నేసి ప్లాట్లుగా ఏర్పాటు చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గోంగళ్ళ రంజిత్ కుమార్ కబ్జాకు గురైన అట్టి స్థలాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..335 సర్వేనెంబరులోని 5ఎకరాల 16 గుంటల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఇనామి భూమిని ఇరువర్గాల రాజకీయ పార్టి నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుస్తూ కబ్జాకు పాల్పడడమే కాక గ్రామ ప్రజలను నయవంచనకు గురి చేస్తూ అన్యాయానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ఎవరైతే శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానానికి పూజారిగా సేవ చేస్తారో అలాంటి వారికి ఈ భూమి ఉపాధికై వ్యవసాయం చేసుకొనుటకు అవకాశం ఉంటుందని 25 సంవత్సరాలకు పైగా ఈ భూమి పైకి ఎవరూ రాలేదని, ఇదే తరుణంలో రాజకీయ నాయకులు ఏకమై కుట్రకు పాల్పడి ఇనామి భూమిలో రాత్రికి రాత్రే కంప పొదల్లను తొలగించి పోలీసుల పహారా మద్య అట్టి భూమిని చదును చేసి ఆక్రమణకు పాల్పడ్డారు. దీనిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకొనుటకు కొత్త నాటకానికి తెరలేపి ఇనామీ భూమిని కబ్జా చేసుకుని దొంగలించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఇనామి భూ వ్యవహారం కోర్టు పరిధి ఉన్నప్పటికీ కొంతమంది భూ కబ్జాదారులు సంబంధంలేని కిష్టాచారి వ్యక్తిపై గ్రామానికి సంబంధించిన ఇనామీ భూమిని దత్తపుత్రుడుగా చిత్రీకరించి కొత్త నాటకానికి తెరతీస్తూ భూ కబ్జాదారులు కిష్టా చారి పేరుపై రిజిస్ట్రేషన్ చేపించడం అన్యాయమని మండిపడ్డారు. పట్టణంలో జరుగుతున్న కబ్జా ఇప్పుడు గ్రామాలకు పాకిందని, ఈ వ్యవహారం అంతా స్థానిక పాలకుల చేతుల ద్వారా జరుగుతుందని, దేవస్థానానికి సంబంధించిన భూమిని అమ్మిన తరువాత తిరిగి గ్రామానికి కొంత డబ్బులు గుడి కి ఇస్తామని ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఇరు వర్గాలైన ఎమ్మెల్యే అనుచరులు మరియు డీకే అరుణమ్మ అనుచరులు చేతులు కలిపి కొత్త డ్రామాకు సిద్ధమయ్యారని అన్నారు.కబ్జాకు గురైన ఇనామి భూమి వ్యవహారంపై నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గ్రామస్తుల తరపున పోరాటం చేస్తామని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1963 నుండి కుడా 2023 దాకా కిడమతి ఇనామ్ గా అలాగే పొజిషన్ లో ఎవరు లేరని ఎవరినైతే దత్తపుత్రుడు గా చూపిస్తున్నారో ఆయన ను ఎప్పుదు గ్రామస్తులు చూడలేదని నిజానికి మూడు తరాల నుండి బోయ కులానికి చెందిన జంగిలప్ప కుటుంబానకి చెందిన వారు గ్రామం లోని ఆంజనేయ స్వామి కు పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు వెంకట్రాములు ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవింద్, ఉపాధ్యక్షులు మునెప్ప,అడివి ఆంజనేయులు, రాము, గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ ఇస్మాయిల్, జగదీష్,మని, వెంకటేష్, శ్రీరామ్, చంద్ర శేఖర్, మల్లేష్, చిలుక మునెప్ప,ఆంజనేయులు, గట్టు,మల్ధకల్ మండలాల అధ్యక్షులు బలరాం నాయుడు,బి.విష్ణు,మల్ధకల్ చిన్నరాముడు,తదితరులు పాల్గొన్నారు.