Listen to this article

జనం న్యూస్ 23సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కంటె ఏలియా.

జిల్లా పోలీస్ శాఖ త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ మరియు మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, మైనర్ వాహనం నడిపి పట్టుబడిన సందర్భాల్లో వాహన యజమాని పై కూడ కేసు నమోదు చేయబడతుందని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ హెచ్చరించారు.వాహన యజమానులు మైనర్ వ్యక్తికి వాహనం ఇవ్వరాదనీ, మైనర్ వాహనం నడిపినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రమాదాలు వాహన యజమాని మరియు ఇతర వ్యక్తులకు కూడా నష్టం కలిగించగలవని, కాబట్టి మైనర్ల కు వాహనం ఇవ్వరాదని ఎస్పీ సూచించారు.అలాగే, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం, నెంబర్ ప్లేట్ దాచడం లేదా తప్పుడు నంబర్లు ఏర్పాటు చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా శబ్ద కాలుష్యాన్ని సృష్టించే విధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను కలిగి ఉన్న వాహన దారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, తెలిపారు. కొందరు వాహనదారులు నెంబర్ గుర్తించలేని ఫ్యాన్సీ డిజైన్ లేదా తప్పుడు నంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత త్వరగా, అన్ని వాహనాల నెంబర్ ప్లేట్లను నిబంధనలకు అనుగుణంగా సరిగ్గా ఏర్పాటు చేయాలి. లేకపోతే వాహనదారులపై చీటింగ్ కేసులు నమోదు చేయబడతాయి. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని తెలిపారు.నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఉపయోగించి చైన్ స్నాచింగ్ మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉన్నందున, నిరంతర తనిఖీలు జిల్లా పోలీస్ శాఖ చేపడుతుందని, జిల్లా పరిధిలోని ప్రజలు పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ కోరారు.