Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

భూపాలపల్లి మంజూరునగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు దుర్గామాత అమ్మవారు శ్రీ గాయత్రీ అమ్మవారి అవతారమెత్తి భక్తులకు దర్శనం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం,అర్చన చండీ పారాయణం కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆలయ ధర్మకర్తలు గండ్ర వెంకట రెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి కుటుంబ సమ్మేతంగా ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అర్చకులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు…