జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
పట్టణంలో దినదినాభివృద్ధి చెందుతున్న లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లావు సుష్మ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు దేవాలయాల్లో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిగినాయి ఈ కార్యక్రమంలో భాగంగా జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ హాస్పిటల్లో షిరిడీ నుంచి తెచ్చిన సాయి వస్త్రంతో సత్కరించి సాయి చిత్రపఠమును అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ వైద్యం అతి ఖరీదైనదిగా మారడంతో చాలామంది ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారని అటువంటి సమయంలో లీలావతి హాస్పిటల్స్ డాక్టర్ సుష్మా అతి తక్కువ వైద్య ఖర్చులతో తన దగ్గరకు వచ్చే వారికి ఆపరేషన్ లేకుండా సహజ కాన్పులతో ఆధునిక వైద్యంతో ముందుకు సాగిపోతున్నారని దినదినాభివృద్ధి చెందుతూ మానవత్వానికి మరో మారుపేరుగా నిలుస్తున్నారని వచ్చిన పేషంట్లను పెద్దతో చూస్తూ తగిన సలహాలు సూచనలు ఇస్తూ ప్రజల ఆదరాభిమానాలను కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మద్దుల ప్రసాద్ తదితరులు డాక్టర్ గని ప్రశంసించారు


