జనం న్యూస్ సెప్టెంబర్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా శాయంపేట మండలం
ఎం ఈ పి ఎ మెపా ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) హన్మకొండ జిల్లా సంయుక్త కార్యదర్శి గా శాయంపేట మండలంలోని గట్లకనపర్తి గ్రామానికి చెందిన పల్లెబోయిన సూర్యప్రకాష్ ముదిరాజ్ కు మెపా రాష్ట్ర కార్యాలయంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు పులి రాజేష్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్,రాష్ట్ర కమిటీ సభ్యుల చేతుల మీదుగా పల్లె బోయిన సూర్య ప్రకాష్ ముదిరాజ్ కు నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. జాతి ఐక్యత కోసం ముదిరాజ్ యువత ముందుకు రావాలని మన హక్కుల కోసం ప్రభుత్వం తో పోరాడాలని రాజకీయాలకు అతీతంగా పని చేయాలని అన్నారు. అనంతరం నూతన కమిటీ లో స్థానం పొందిన సూర్యప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ… మెపా చేసే కార్యక్రమాలు బాగున్నాయని అందుకోసమే మెపా లో జాయిన్ కావడం జరిగిందని,ఈ అవకాశం కల్పించిన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్, నీరటి రాజు ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు పులి రాజేష్ ముదిరాజు లతోపాటు రాష్ట్ర జిల్లా మండల కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర గౌరవ సలహాదారులు పులి ప్రభాకర్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు పులి రాజేష్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు గోనెల విజేందర్ ముదిరాజ్,జిల్లా కార్యదర్శి కల్లెబోయిన కోటేశ్వరరావు ముదిరాజ్, ఆళ్ల నరేష్ ముదిరాజ్ లు పాల్గొన్నారు..


