ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత,
జనం న్యూస్,సెప్టెంబర్ 23,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ సెక్టరలోని చాప్ట బి,అంగన్వాడీ సెంటర్లలో మంగళవారం చిన్నారులు చిన్నారుల తలులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత, పాల్గొన్నారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ఆటపాటలతో పాటు, పౌష్టిక ఆహారాన్ని, ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టిచర్లు స్వరూప,రాధా, లింగమ్మ,ఆశ,సునీత, ఆయా సంతోషి,వనిత, తదితరులు పాల్గొన్నారు.


