Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 23 మండలం పెన్ పహాడ్ : ప్రజలు పరిచయం లేని వ్యక్తుల తోటి జాగ్రత్త వహించాలని ఎస్సై కస్తాల గోపికృష్ణ ఒక ప్రకటనలో అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో ప్రజలు తమ పిల్లలను తీసుకురావడం కోసం బస్సులో ప్రయాణించేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానస్పదంగా ఉన్నట్లయితే వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలని, ఊరికి వెళ్లేటప్పుడు తాళం వేసుకొని తమ ఆభరణాలను, బ్యాంకుల్లో కానీ తెలిసిన వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా దాచుకోవాలని అన్నారు. మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవద్దని చైన్స్ దొంగలు తమ ఉనికిని తెలుసుకొని తమపై హత్య చారానికి ప్రయత్నిస్తారని అన్నారు. పిల్లలు ఆరుబయట ఆడుకునే సమయంలో ఎవరైనా తెలియని వ్యక్తులు తిను బండారాలు ఇచ్చినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని తల్లిదండ్రులను కోరారు. చిన్న పిల్లలు ఫోన్ కి ఎడిట్ కాకుండా చూసుకోవాలని చెరువులు, కుంటలు, వాగులు నిండుకుండలా ఉండడం వల్ల బతుకమ్మను ఆడి వదిలేసేటప్పుడు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని పిల్లలు సెల్ఫీల కోసం పోకుండా చూసుకొనే బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నదని, ఎవరైనా ఫోన్ చేసి దసరా ఆఫర్ల పేరుతో ఓటీపీ అడిగినట్లయితే వాళ్లు సైబర్ నేరగాళ్లు. వారి దగ్గర ఎవరు మోసపోకూడదని, దుర్గామాత మండపాల దగ్గర డీజే సౌండ్ తోకానీ, తాగి ఎవరైనా పక్కవారిని ఇబ్బంది పెట్టి అవాంఛనాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు