జనం న్యూస్ సెప్టెంబర్ 23 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)దేవి నవరాత్రులను పురస్కరించుకొని గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లి లో వెలసిన శ్రీ మారెమ్మ దేవాలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి దేవిరాజ్ స్వామి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం రెండవ రోజు గాయత్రీ దేవి అలంకరణలో శ్రీ మారెమ్మ దేవి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవీ నవరాత్రులు మరియు మంగళవారం నీ పురస్కరించుకొని శ్రీ మారెమ్మ దేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన గోపూజ పుష్పాలంకరణలతో శ్రీ మారెమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు గుమ్మయ్య గారిపల్లి కాలువ రామిరెడ్డి, కాలువ లక్ష్మిదేవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు


