Listen to this article

జనం న్యూస్, సెప్టెంబర్ 24, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

జగదేవపూర్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలో ” శివాజీ యూత్ ” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని బుధవారం స్థానిక గ్రామ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగరాజు, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు,అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మండల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు,దేవి శరన్నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని శివాజీ యూత్ సభ్యులకు తెలిపారు,