Listen to this article

జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 24

జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ ఆవరణలో జమ్మి మొక్క నాటిన బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్

మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఊరికో జమ్మిచెట్టుగుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోనీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జమ్మి మొక్కకు పూజలు ప్రత్యేకమేనా పూజలు నిరహించి తదనంతరం ఆలయ ఆవరణలో జమ్మి మొక్క నాటిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి జమ్మి మొక్క నాటడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అధినేత మాజీ రాజ్యసభ సభ్యులు చేపట్టిన ఊరు ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టులో భాగంగా మన సంప్రదాయం మనకు గుర్తు ఉండేలా ప్రతి దసరాకి జమ్మి ఎంత ముఖ్యమో మన అందరికి తెలుసు కాబట్టి అందులో భాగంగా మేము కూడా మా వెంకటేశ్వర ఆలయంలో మొక్క నాటడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న రైతుబంధు సమితి అంకం రాజేశం, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొత్తూరు స్వామి, సోషల్ మీడియా కన్వీనర్ మొగిలిపాలెం. రమేష్, రామంచ లక్ష్మణ్, బైరి వెంకటి, రామచంద్రం, మధుసూదన్, మరియు హరిత సేన సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు