జనం న్యూస్ 24 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
విషయం :- గద్వాల,ఆత్మకూరు వయా కొత్తపల్లి,జూరాల మీదుగా హై లెవల్ బ్రిడ్జి నిర్మించుట గురించి…
ఆర్య:- మేము అనగా కొత్తపల్లి, గుంటిపల్లి,రేకులపల్ల,చెనుగోనిపల్లి,మదనపల్లి,శెట్టి ఆత్మకూరు, అగ్రహారం మరియు గద్వాల ప్రాంత ప్రజలము విజ్ఞప్తి చేయడం ఏమనగా గద్వాల నుంచి ఆత్మకూరు వరకు వయా కొత్తపల్లి,జూరాల గ్రామాల మధ్య క్రిష్ణనది మీదుగా రహదారి మరియు బ్రిడ్జి నిర్మించాలని వినతిపత్రం ఇచ్చి గ్రామస్థులు కోరారు…కొత్తపల్లి జూరాల మీదుగా కాక వేరే ప్రాంతంలో నిర్మించినట్లుతే 24 కిలోమీటర్ల దూరం అధికంగా ప్రయాణించాలని,ఇట్టి రోడ్డును కొత్తపల్లి,జూరాల నిర్మించిన అతి తక్కువ 10 కిలోమీటర్ల దూరం మాత్రమే అవుతుంది,అంతే కాక నిర్మాణ వ్యయంలో 30 శాతం వరకు తగ్గుతుందని,గద్వాల నుంచి హైదరాబాద్ ప్రయాణం చేసేందుకు గాను 24 కిలోమీటర్లు దూరం తగ్గి ఒక గంట అధ అయితుందని,అలాగే గద్వాల,ఆత్మకూరు ల మధ్య కొత్తపల్లి, జూరాల వరకు ప్రస్తుతం ఉన్న రోడ్లను ఉపయోగించడం ద్వారా అధికం చేయనవసరం లేదని,రోడ్డు నిర్మాణానికి అదనంగా సరిపడు ప్రభుత్వం నిబంధనల ప్రకారం రైతులందరు భూములు ఇచ్చుటకు సిద్దంగా ఉన్నామని తెలిపారు,మాపై మా ప్రాంత అభివృద్ధిపై దయవుంచి గత కొన్ని ఏళ్లుగా వివక్షతకు గురౌతున్న మా ప్రాంతం గద్వాల, ఆత్మకూరు వయా కొత్తపల్లి జూరాల మీదుగా చేయించి నిర్మించాలని కొత్తపల్లి గ్రామ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ వినతిపత్రం దజేసినారు..గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వంతో సంబంధిత శాఖ మంత్రివర్యులతో మట్లాడి వనపర్తి జిల్లా ఆత్మకూరు గద్వాల జిల్లా వయా కొత్తపల్లి మీదుగా మంత్రాలయం వరకు జాతీయ రహదారి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని సరితమ్మ గ్రామస్థులకు హామీ ఇచ్చారు…ఈ కార్యక్రమంలో కొత్తపల్లి, గుంటిపల్లి,రేకులపల్ల,చెనుగోనిపల్లి,మదనపల్లి,శెట్టి ఆత్మకూరు, అగ్రహారం మరియు గద్వాల ప్రాంత ప్రజలు తదితరులు ఉన్నారు..


