జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలానికి నూతనంగా వచ్చినా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కి అంబేద్కర్ సామాజిక సేవా సమితి అధ్యక్షుడు గజ్జి సదయ్య మర్యాదపూర్వకంగా కలసి ఆయనకు శాలువతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా సదయ్య మాట్లాడుతూ 2020 నుండి ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు అంబేద్కర్ సామాజిక సేవ సమితి ద్వారా చేయడం నిత్యం జరుగుతుంది. ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మా సంఘం వెంటనే ఉంటు ప్రజలకు సేవ చేస్తున్నామని అన్నారు
ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రమేష్ కుమార్ ఎమ్మార్వో సిబ్బంది మరియు వైద్యుల నాగిరెడ్డి, మహమ్మద్ వలి, తదితరులు పాల్గొన్నారు….


