Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 26

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛత హి సేవా’ కార్యక్రమంలో భాగంగా, గురువారం తర్లుపాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం జరిగింది. మండల అభివృద్ధి అధికారిణి (ఎంపీడీఓ) ఓ. అన్నమ్మ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ ఓ. అన్నమ్మ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛమైన వాతావరణంతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆమె సిబ్బందికి పిలుపునిచ్చారు.అనంతరం, ఎంపీడీఓ మరియు మండల ప్రజాపరిషత్ కార్యాలయ సిబ్బంది కలిసి కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. గంటల పాటు శ్రమించి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, తమ ఇళ్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో ఏఓ బుర్రి చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ కోటేశ్వర రెడ్డి,పంచాయితీ కార్యదర్శి కాలంగి శ్రీనివాసులు,వెల్ఫేర్ అసిస్టెంట్ సుధీర్,కార్యాలయ సిబ్బంది అనిల్, ఉదయ్,టిడిపి నాయకులు ఈర్ల వెంకటయ్య, గోసు వెంకటేశ్వర్లు,పాల్గొన్నారు