జనం న్యూస్ సెప్టెంబర్ 26 సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, :చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని రామచంద్రపురం సండే మార్కెట్ పార్క్ ఆవరణలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు, శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ, “చాకలి ఐలమ్మ గారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం సాయుధ పోరాటం చేశారు. ఆమె పోరాటస్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రామచంద్రపురం ఉపాధ్యక్షులు శ్రీశైలం, జనసేన పార్టీ పటాన్చెరు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అఖిల్, టీం చారిటీ ఫౌండేషన్ చైర్మన్ ఆటుగారి అనిల్, ప్రమోద్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.


