

అచ్యుతాపురం(జనం న్యూస్): అచ్యుతాపురం సెజ్ అధిస్తాన్ బ్రాండిక్స్ జోన్లో ఉన్న కొన్ని
పరిశ్రమలకు చెందిన కార్మికులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి అరగంట డ్యూటీ అదనంగా చేయాలని కార్మికుల పై యాజమాన్యం ఒత్తిడి చేయడాన్నీ సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము, మండల కార్యదర్శి కె. సోము నాయుడు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమలలో చట్ట ప్రకారం 8 గంటల పనిదినం అమలు చేయాలి తప్ప అదనంగా సమయం పెంచకూడదని, బ్రాండిక్స్ మహిళా కార్మికులు ఏ షిఫ్ట్ ఆరు గంటలకి వెళ్లాలంటే తెల్లవారుజామున రెండు గంటలకు లేచి రెడీ అయ్యి ఉదయం 3 గంటలకు బస్సు పాయింట్ కి వెళ్తున్నారని ఏ షిఫ్ట్ విధులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం నాలుగు అవుతుందని ఏ,బి రెండు షిఫ్ట్ లు డ్యూటీ చేయాలంటే 15 గంటలు పడుతుందని దీనివలన కార్మికులకు సరైన విశ్రాంతి లేకపోవడంతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని. మళ్లీ ఇప్పుడు అరగంట సమయం పెంచితే మరిన్ని ఇబ్బందులకు గురవుతారని, అరగంట సమయం పెంపుదల నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కు తీసుకోవాలని పాత పద్ధతిలో ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేసి కార్మికులకు కనీస వేతనాల జివోను సవరించి కార్మికుల కష్టానికి తగ్గ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.