బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు
జనం న్యూస్, జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం:
మండలంలో గల ముత్యంపేట సుగర్ ఫ్యాక్టరీ కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2014లో 1000 మంది చెరుకు రైతులతో డాక్టర్ చిట్నేని రఘు ఆధ్వర్యంలో మహా పాదయాత్ర వల్లే షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం కాబోతుంది, 2019లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో చెరుకు రైతుల కోసం ముత్యంపేట నుండి బోధన్ వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు, మల్లాపూర్ మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2025 లో చెరుకు రైతులు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ఇప్పటికైనా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి సన్నాహాలు చేయడం హర్షనీయం అని అన్నారు, ముత్యంపేట సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ పదవిని కోరుట్ల నియోజకవర్గానికి చెందిన చెరుకు రైతులకే కేటాయించాలని డాక్టర్ రఘు డిమాండ్ చేశారు


