జనం న్యూస్ ;26 సెప్టెంబర్ శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ :
ఏడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలతో గ్రామంలో చైతన్య కార్యక్రమాలు – సమాజ సేవయే ఎన్ ఎస్ ఎస్ వాలింటీర్లు లక్ష్యం దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి సమాజ సేవయే ఎన్ ఎస్ ఎస్ వాలింటీర్లు లక్ష్యం అని దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి అన్నారు కీసర మండలంలో చేర్యాల గ్రామంలో గత ఏడు రోజులుగా జరిగిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం శుక్రవారం రోజు ఘనంగా ముగిసింది. హైదరాబాదులోని విద్యానగర్ కు చెందిన వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి హాజరయ్యారు . ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ మహేష్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ లావణ్య అధ్యక్షత వహించారు. విశిష్ట అతిధులుగా న్యాయవాది సినీ ప్రముఖులు సి.వి.ఎల్ నరసింహారావు , జిల్లాల తిరుమల రెడ్డి , బాలరాజ్ యాదవ్ , బి శ్రీనివాసరావు , నవీన్ యాదవ్ , జంగారెడ్డి , మరియు గ్రామంలోని అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ గత ఏడు రోజులుగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చీర్యాల గ్రామంలో చేసిన స్వచ్ఛభారత్ కార్యక్రమాలు అద్భుతమని అన్నారు , గ్రామంలో నిర్వహించిన మెడికల్ క్యాంపు ఎంతో మందికి ఉపయోగపడిందని చెప్పారు , మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు , పర్యావరణ కాలుష్యం, న్యాయ సంబంధిత అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలను ఎంతగానో కొనియాడారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నిస్వార్థంగా దసరా సెలవులను సైతం త్యాగం చేసి ఏడు రోజులపాటు చీర్యాల గ్రామంలో సమాజ సేవలో పాల్గొనడం ఎంతో గొప్ప విషయమని అభినందించారు. నేటి ఈ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు భవిష్యత్తులో గొప్ప గొప్ప ప్రభుత్వ పదవులను అలంకరించి వారికి అభిరుచి కలిగిన ఇతర రంగాలలో గొప్ప స్థాయిని చేరుకొని ముఖ్య అతిథులుగా చీర్యాల గ్రామంలో జరిగే కార్యక్రమాలకు భవిష్యత్తులో రావాలని ఆకాంక్షించారు. అనంతరం వాలంటీర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ వాలింటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


