Listen to this article

జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 27

జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని హిమ్మత్రావుపేట గ్రామంలో మహిళా గ్రూపులలో లేని 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు దాదాపు 100 మంది మహిళలకు 50,000 వేల విలువగల చీరలను హిమ్మత్రావు పేట లో కోడిమ్యాల మాజీ జడ్పీటీసీ ప్రశాంతి – కృష్ణారావు వారి కుమార్తె డాక్టర్.అర్చిత-మిత్రరావు కలిసి మిత్రుల సహకారంతో వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, అకునూరి మల్లయ్య, గంగరాజము, మహిళలు పాల్గొన్నారు.