జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట
మండలంలోని పెద్దకోడపాక గ్రామానికి చెందిన కీ||శే “మంద జంపయ్య” అనారోగ్యంతో మరణించగా తమ కుమారుడు అయిన మంద సురేష్ 2005 బ్యాచ్ పదవ తరగతి” మిత్రులు ఇంటికి చేరుకొని వారి తండ్రికి నివాళులు అర్పించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపి ₹25000/- వేల రూపాయలు అర్థిక సహాయాన్ని తమ కుటుంబానికి అందజేసి అండగా నిలిచారు. గత 7 సంవత్సరాలనుండి తమతో పాటు చదువుకున్న 2005 ఎస్ ఎస్ సి బ్యాచ్ మిత్రుల కుటుంబంలో ఎలాంటి ఆపద వచ్చిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ బాసటగా నిలుస్తున్నామని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో దాసి శ్రావణ్ కుమార్, రంగు రాజేష్, కోగిల సుమన్,పైండ్ల భాను, మోరె సుమన్, కోగిల తిరుపతి, బైని కర్ణాకర్, అల్లూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు…..


