Listen to this article

జనం న్యూస్ 29 జనవరి 2025 ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్:- ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కేడిసిసి బ్యాంక్ నందు ప్రధానమంత్రి జీవనజ్యోతి రు.2,00,000 భీమా చెక్కును నామినీకి బ్యాంకు డైరెక్టర్ విశాల సహకార సంఘం అధ్యక్షులు శ్రీపతి రవీందర్ గౌడ్ మరియు బ్యాంక్ మేనేజర్ మంద స్రవంతి తో కలిసి అందజేసినారు. ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం మరణించిన చింతలపల్లి గ్రామానికి చెందిన హింగె అశోక్ కే డి సి సి బ్యాంకులో ఖాతాదారుడుగా ఉండి ప్రధానమంత్రి జీవనజ్యోతి ఇన్సూరెన్స్ చేసి ఉన్నందున ఖాతాదారుడు మరణించడం వలన అతని భార్య అయిన నామిని గా ఉన్నందున హింగే పద్మకి రెండు లక్షల రూపాయల చెక్కును అందజేసినారు ఇది వారి కుటుంబానికి ఎంతో కొంత సహకారంగా ఉంటాదని తెలియజేశాను. కావున బ్యాంకు ఖాతాదారులు ప్రతి ఒక్కరు తప్పకుండా బీమా పథకం అయినా ప్రధానమంత్రి జీవనజ్యోతి మరియు సురక్ష బీమా యోజన పథకానికి 456 రూపాయలు చెల్లించి ఇన్సూరెన్స్ చేయించుకోగలరు అని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ మంద స్రవంతి ఫీల్డ్ ఆఫీసర్ మోడం ప్రవీణ్ మరియు బ్యాంక్ అధికారులు ఖాతాదారులు పాల్గొన్నారు