,సెప్టెంబర్26: (జనంన్యూస్)
జిల్లా, చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శనివారం ఉదయం 08.30 గం.కు పద్మశాలి ముద్దు బిడ్డ,ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆఖల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వనం నర్సింలు నేత ఓక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల బాంధవులు జయంతి కార్యక్రమం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.కాబట్టి ఇట్టి కార్యక్రమానికి చిన్నశంకరంపేట మండల పరిధిలోని ఆయా గ్రామాల నుండి నాయకులు అధిక సంఖ్యలో తరలి రావాలని అధ్యక్షులు టి.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుండు అంబదాస్,మండల యువజన అధ్యక్షులు ఉడుత శ్రీమన్ నారాయణ,పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ కిష్టయ్య, మండల కార్యవర్గ సభ్యులందరూ ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.


