

జనం న్యూస్ జనవరి(29) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని తిరుమలగిరి మండల కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ యందు సూర్యాపేట జిల్లా ప్రాంతీయ రవాణా అధికారి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ఉత్సాహాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పహనదారులు వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ద్విచక్రవాహందరులు హెల్మెట్ ధరించాలని కార్లు,లారీలు,స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుని వాహనాలు నడపాలని మరియు మత్తు పానీయాలు ఉపయోగించి వాహనాలు నడపవద్దని సూచించాడు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాశ్ రెడ్డి సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.